శిల్పా కుటుంబం పేద ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలపై విమర్శలు చేస్తే సహించేది లేదు – వైసీపీ

చేతనైతే నష్యం సహకార్ పేరుతో మీరు కూడా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయండి

నెలకు 83 రూపాయిల కే రెండు ఎకరాల స్థలం టిడిపి కార్యాలయానికి కేటాయింపుపై నంద్యాలలో భారీ విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 05  :

నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డులో టీడీపీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. రైతుల కోసం కేటాయించిన భూమిని నామమాత్రపు ధరకే లీజుకు తీసుకోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. శిల్పా కుటుంబంపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నంద్యాల వైసీపీ కార్యాలయంలో  రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యకార్యదర్శి రత్నబాబు చౌదరి, వైసీపీ నేతలు జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనీల్ అమృతరాజ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, , నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివయ్య,జిల్లా కార్యదర్శి దేవనగర్ బాష,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేస చంద్రశేఖర్, ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వారు టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు.

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, శిల్పా సేవా కార్యక్రమాలను విమర్శిస్తే, కించపరిస్తే సహించేది లేదని, మార్కెట్ యార్డు చైర్మన్ కు శిల్పా కుటుంబాన్ని విమర్శించే స్థాయి లేదని హెచ్చరించారు. శిల్పా సహకార్ ద్వారా నిత్యావసరాలపై 10% డిస్కౌంట్ ఇస్తుంటే, దానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని.. అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని, కేవలం ఏడాదికి 2 వేల రూపాయలకే 33 ఏళ్ల పాటు టీడీపీ కార్యాలయానికి లీజుకు ఇవ్వడం రైతులను వంచించడమేనని, ఇది భూదోపిడని వైసీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రైతు భరోసా, పంట గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నందమూరి నగర్ బ్రిడ్జి, ఉర్దూ కాలేజీ పనులను పూర్తి చేయలేకపోయారని, బొగ్గులైన్ వాసులకు గత ఎన్నికల్లో ఫేక్ పట్టాలిచ్చి మోసం చేశారని విమర్శించారు. “రైతుల భూములను పార్టీ ఆఫీసుల కోసం కేటాయించుకోవడం దారుణమని. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధిపై మేము ఎక్కడైనా చర్చకు సిద్ధంఅని సవాల్ విసిరారు. శిల్పా మహిళా బ్యాంకు ద్వారా వేల మందికి లబ్ధి చేకూరుతుంటే, ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని. దమ్ముంటే వచ్చే రుణాల పంపిణీకి మీరే ముఖ్య అతిథులుగా వచ్చి వాస్తవాలు తెలుసుకోండన్నారు.”కేవలం దోచుకోవడమే లక్ష్యంగా కూటమి నాయకులు పనిచేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని వైసీపీ నేతలు హెచ్చరించారు.

Scroll to Top