సేవా మనసుతో ముందుకు – తాటికొండ బుగ్గరాముడు

దేవాలయం అన్నదానానికి చేయూత – గ్రామాలకు అండగా నేత

  • ఈస్టర్ పండుగ సందర్భంగా కడమల కాల్వ గ్రామస్తులకు 5000/- విరాళం
  • పెద్ద దేవళాపురం గ్రామం నందు గల ఏకశిలా అభయాంజనేయ స్వామి దేవాలయం నందు అన్నదాననికి 5000/- విరాళం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 05  :

బండి ఆత్మకూరు మండలం నందుగల కడమల కాల్వ గ్రామస్తులకు ఈస్టర్ పండగ సందర్భంగా 5000/-విరాళం అలాగే పెద్ద దేవళాపురం ఏకశిల అభయాంజనేయ స్వామి దేవాలయం నందు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నంద్యాల 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ ఇంఛార్జి తాటికొండ బుగ్గరాముడు.ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు మాట్లాడుతూ ఈస్టర్ పండగ సందర్భంగా కడమల కాల్వ గ్రామస్తులకు అలాగే పెద్ద దేవాళాపురం ఏకశిల అభయాంజనేయ స్వామి దేవాలయం నందు అన్నదానానికి విరాళం అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కడమల కాల్వ గ్రామస్తులు,అభయాంజనేయ స్వామి కమిటీ సభ్యులు ఎద్దుల సుబ్బరాయుడు,పబ్బతి రాజేష్,పబ్బతి మోహన్,కొప్పుల భాస్కర్,పబ్బతి రంగస్వామి, వెంకటయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top