జిల్లావ్యాప్తంగా విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్

నేర నియంతరణ, ప్రజల భద్రతకు భరోసా

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఏప్రిల్ 01 :
నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలని *జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాలమేరకు పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాలను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు…

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు…
అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు…

రహదారి భద్రత నిబంధనలు… ఉల్లంఘనలపై చర్యలు…
రహదారి భద్రతపై అవగాహన కల్పించడం, ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
మైనర్ డ్రైవింగ్ చేయకూడదని, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కూడా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.
ప్రజలు భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే స్దానిక పోలీసులకు గాని, డయల్ 112 కు గాని లేదా డయల్ 100 గాని సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. 

Scroll to Top