
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 01 :
నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ లో బర్త్ సర్టిఫికెట్ పొందాలంటే నెల రోజులు వేచి ఉండాలి మరలా మామూలు చెల్లించాల్సిందే?. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు బీద సాధ వారు ఎక్కువ శాతం వెళ్తుంటారు. కానీ అక్కడ ఎలాంటి ఖర్చు ఉండదు లే అనుకుంటే అంతే సంగతి ఏదైనా ధృవీకరణ పత్రాలు పొందాలంటే మామూలు కొడితే గాని ఇచ్చే స్థితిలో లేనట్టుగా రోగులు చర్చించుకుంటున్నారు. బర్త్ సర్టిఫికెట్ పొందాలంటే నెలలు తరబడి వేచి ఉండాల్సిందేనని, సరే వేచి ఉందాం లే అప్పుడే తీసుకుందాం అనుకుంటే మరలా మామూలు కొడితే గాని పత్రాలు ఇవ్వడం లేదని అక్కడ ఉన్నటువంటి రోగులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటివి జరగకుండా అన్ని సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
