కొత్తపల్లె గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, తాతిరెడ్డి తులసిరెడ్డి

సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఘన సన్మానం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 31 :

నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా విచ్చేసి, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి తో కలిసి ఈ పనులను ప్రారంభించారు. కొత్తపల్లె గ్రామ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం-2 భవనాన్ని మంత్రి ఫరూక్, తులసిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నూతనంగా నిర్మించిన సి.సి. రోడ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రజల గుమ్మం వద్దకే తీసుకువచ్చామని . సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందేలా నూతన సచివాలయ భవనాన్ని నిర్మించి ప్రారంభించామని తెలిపారు . గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా నిధులు కేటాయిస్తూ, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కొత్తపల్లె గ్రామంలో సి.సి. రోడ్ల నిర్మాణం ద్వారా రవాణా ఇబ్బందులు తొలగిపోతాయని. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు . కులమతాలకు అతీతంగా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకమైన పాలన అందిస్తున్నామని . అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో కొత్తపల్లె గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని. నేడు ప్రారంభించుకున్న సచివాలయం 2 మరియు సి.సి. రోడ్లు గ్రామ ముఖచిత్రాన్ని మారుస్తాయని తెలిపారు. ప్రజలు చిన్న చిన్న పనుల కోసం పట్టణాలకు వెళ్లకుండా, తమ గ్రామంలోనే ఉన్న సచివాలయాల ద్వారా వేగంగా, పారదర్శకంగా సేవలు పొందాలని . ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందేలా చూడటంలో సచివాలయాల పాత్ర కీలకం పోషిస్తుందని తెలిపారు. గ్రామంలోని ప్రతి వీధిలో సి.సి. రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని. మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ భవనాలను, రోడ్లను ప్రజలు కాపాడుకోవాలని . అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడకుండా పనులు పూర్తి చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులను మంజూరు చేయించి గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ వెంట ఉండి పార్టీ నే నమ్ముకుని ఉన్న టిడిపి సీనియర్ 30 నాయకులకు ఘనంగా మంత్రి ఫరూక్ గారి చేతుల మీదగా సన్మానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహేష్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి , శేఖర్ రెడ్డి, మనీష్ రెడ్డి, సర్పంచ్ నారాయణ, ధనుంజయ గౌడ్,  నక్క చిన్నయ్య, కాంట్రాక్టర్ దక్షిణరెడ్డి, ఈశ్వరయ్య, ఎమ్మార్వో శ్రీనివాసులు, ఎంపీడీవో సుగుణ శ్రీ, నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, మండ్ల గుర్రప్ప, చలం బాబు, నాగేశ్వరరావు, నందం బాబురావు, డిపో గఫార్,  స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top