
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 30 :
నంద్యాల టౌన్ 38వ వార్డు నందమూరి నగర్ నందు నివాసం ఉంటున్న పేద ముస్లిం మహిళా వివాహానికి స్థానిక మంత్రి వర్యులు ఎన్ఎండి.ఫరూక్ వారి కుమారులు ఎన్ఎండి.ఫిరోజ్, ఎన్ఎండి.ఫయాజ్ ఆదేశాల మేరకు వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు మాట్లాడుతూ వార్డు నందు ఎవరు మరణించిన, వార్డు నందు ఎవరి వివాహం జరిగిన వారికి ఆర్థిక సహాయం చేయడం జరుతుంది అని ఆయన అన్నారు.ఇప్పటికి దాదాపుగా వార్డు నందు 45 వివాహాలకు 30మంది మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా కుటుంబ సభ్యులు మరియు స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
