గుంతనాల, బి.శివరామపురం గ్రామలలో సి.సి. రోడ్లను ప్రారంభించిన మంత్రి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 31 :

నంద్యాల మండలం గుంతనాల, బి.శివరామపురం గ్రామలలో అభివృద్ధి పనులు వేగంగా పుంజుకుంటున్నాయి. గుంతనాల, బి.శివరామపురం గ్రామలలో నూతనంగా నిర్మించిన సి.సి. రోడ్లను మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధియే రాష్ట్ర అభివృద్ధి అని, ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు . గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గుంతనాల మరియు బి.శివరామపురం గ్రామలలో నిర్మించిన సి.సి. రోడ్డు వల్ల స్థానికులకు రవాణా ఇబ్బందులు తొలగుతాయని, రాబోయే రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు కులమతాలకు అతీతంగా అందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయమని, అధికార యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహకరించిన అధికారులు, గ్రామ పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంతనాల సర్పంచ్ ఎం. నాగలక్ష్మి, గుంతనాల గ్రామ టిడిపి ఇంచార్జి నాగేశ్వరరావు, మిట్నాల ఎంపీటీసీ చిలుకూరి సుజాత, కేసీ కెనాల్ నీటి సంఘాల అధ్యక్షులు చిలుకూరి రవిబాబు, టిడిపి నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, గుంతనాల ఆనందరావు, ప్రదీప్ రెడ్డి, మిద్దె హుస్సేన్, ఎంపీడీవో, ఎమ్మార్వో, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top