

సత్యం వార్త / నంద్యాల / మార్చి 27 :
నంద్యాల పట్టణంలోని ఒక చాయ్ కేఫ్ లో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సామాన్యుడిలా సందడి చేశారు. హోదాను పక్కన పెట్టి, అందరితో కలిసి చాయ్ తాగుతూ.. సరదాగా ముచ్చటిస్తూ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. కులమతాలకు అతీతంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.శిల్పా రవిరెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా.. ఎప్పుడూ ప్రజల మనిషే! అని నిరూపించుకున్నారు.
