

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 27 :
నంద్యాల పట్టణంలోని బైరమల్ స్ట్రీట్, అమ్మవారి శాల సమీపంలో అయ్యప్ప స్వీట్స్ ప్రొప్రైటర్ రామకృష్ణ నూతనంగా ఏర్పాటు చేసిన “అయ్యప్ప స్వీట్స్ మరియు టిఫిన్ షాప్” శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ నూతన షాప్ ను టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నాణ్యమైన స్వీట్లు, రుచికరమైన మరియు శుభ్రమైన టిఫిన్లు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రొప్రైటర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని, ప్రజల ఆదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రొప్రైటర్ రామకృష్ణ మాట్లాడుతూ తమ వద్ద నాణ్యతకు పెద్దపీట వేస్తామని, వినియోగదారులకు తక్కువ ధరలోనే నాణ్యమైన స్వీట్లు మరియు టిఫిన్లను అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, ఉప్పరి కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, అనుపూర్ ఈశ్వర్ , బింగుమల్లె శ్యామ్ సుందర్ గుప్తా, జాకీర్, స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు రామకృష్ణ కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
