- నందమూరి నగర్ కోదండ రామాలయంలో ఘనంగా సీతారాముల కల్యాణం – ప్రత్యేక పూజల్లో టిడిపి ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 27 :
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని 38వ వార్డు నందమూరి నగర్లోని కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
ఈ పూజా కార్యక్రమాల్లో 38వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొన్నారు.
ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవం సందర్భంగా వేదపండితులు మంత్రోచ్చారణలతో కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించగా, భక్తులు హర్షాతిరేకంతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుగ్గరాముడు మాట్లాడుతూ, శ్రీరాముని దయాకటాక్షాలతో సమస్త ప్రజలకు శాంతి, సుభిక్షం నెలకొనాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఐక్యతతో, భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
