దేశ ప్రజలకు ఆధునిక వైద్యం అందించడమే లక్ష్యం – ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త  / మార్చి 18 :
కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతదేశ ప్రజలకు ఆధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్ డి ఏ ప్రభుత్వం పనిచేస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్లమెంట్ హెల్త్ స్టాండింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం న్యూ ఢిల్లీలో నిర్వహించిన హెల్త్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధానాలపై విస్తృతంగా చర్చించడం జరిగిందని, ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సుధీర్గంగా చర్చించి, పార్లమెంట్ హెల్త్ స్టాండింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలు పంచుకోవడం జరిగిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు

Scroll to Top