
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 18 :
గృహావసరాల కోసం ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని, అవసరానికి మించి సిలిండర్ బుకింగ్‌లు చేయొద్దని నంద్యాల అర్బన్ తాసిల్దార్ శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం తాసిల్దార్ ఒ ప్రకటన లో తెలిపారు. గ్యాస్ సరఫరా, బుకింగ్ వివరాలను ఇకపై పారదర్శకంగా విడుదల చేస్తామని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, వసతిగృహాల్లో వంట గ్యాస్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడైనా గ్యాస్ సరఫరా సమస్యలు ఎదురైతే 1967 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. దీపం లబ్ధిదారులకు సంబంధించిన ఈ-కేవైసీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు స్వర్ణ కార్యాలయాల సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తాసిల్దార్ శ్రీనివాసులు వెల్లడించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని మరోసారి కోరారు.
