నంద్యాలలో వైసీపీ నిరసన – “కూటమి అంటేనే కల్తీ” అంటూ నేతల ధ్వజం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 17 :
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ నేతల తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, కూటమి నేతల “అరాచకాలను” ఎండగడుతూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
 తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్ బి.ఆర్.కె. నాయుడు తన పదవికి కలంకం తెచ్చారని వైసీపీ నేతలు మండిపడ్డారు. పవిత్రమైన పదవిలో ఉంటూ ఆయనకు సంబంధించిన “రాసలీలల” వీడియోలు బహిర్గతం కావడం సిగ్గుచేటని విమర్శించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ కేసులో ఉన్నారని, ఇటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ వ్యవహారంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించిన వారిపై దాడులు, వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. “కూటమి అంటేనే కల్తీ.. లడ్డూ కల్తీ అని నిరూపించలేకపోయారు కానీ, వీరి పాలనలో నైతికత మాత్రం పూర్తిగా కల్తీ అయిపోయింది.” — వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వివాదాస్పద వీడియోల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.కె. నాయుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీపై ప్రభుత్వం విచారణ జరిపించాలని, రాజకీయ వేధింపులు, దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కారురవికుమార్,సాయిరాంరెడ్డి, కౌన్సిలర్ మేస చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్లు సుబ్బరాయుడు, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, వైసీపీ నాయకులు ఎర్రన్న, , బాస్కర్ రెడ్డి, మాలెపాటి ఆంజనేయులు, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top