1000 కుటుంబాలకు బిర్యానీ బాక్స్ లు పంపిణీ
అయిదేళ్లుగా కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 17 :నంద్యాల పట్టణం 1 వ వార్డ్ కౌన్సిలర్ పిచ్చికే నాగార్జున ప్రజాసేవ చేస్తూ, కుల మతాలకు అతీతంగా పవిత్ర రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం సంతోషతగ్గ విషయం అని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్య దర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్ పేర్కొన్నారు.పట్టణంలోని 1 వార్డు కు సంబంధించిన పఠాన్ పేటలో కౌన్సిలర్ పిచ్చికే నాగార్జున ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కు ఎన్.ఎం.డి.ఫిరోజ్,మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డ్ కౌన్సిలర్ గా ప్రజలకు సేవలు అందిస్తూ,పిలిచిన వెంటనే ప్రజల సమస్యలు తీరుస్తూ మంచి పేరు కౌన్సిలర్ నాగార్జున తెచ్చు కొన్నారని అన్నారు.పవిత్ర రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం సంతోషతగ్గ విషయం అన్నారు.అనంతరం పటాన్ పేటలో నివసిస్తున్న వెయ్యి మైనార్టీ కుటుంబాలకు ఇంటింటికి తిరిగి బిర్యానీ బాక్స్ లు ఆయన చేతుల మీదుగా అందించారన్నారు.ఈ సందర్భంగా పిచ్చుక నాగార్జున మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చిన్న కార్యకర్తగా ఉన్న నాకు మంత్రి ఎన్.ఏం.డి.ఫరూక్ ఈ వార్డులో సేతు ఇచ్చారని,ఆయన కుమారులు ఫిరోజ్,ఫయాజ్ ల సహకారంతో గెలుపొందనన్నారు.రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా వార్డ్ ప్రజల సహాయ సహకారాలతో నా పై నమ్మకంతో గెలిపించారన్నారు.వార్డులో ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా అండగా ఉండి పనులు చేస్తున్నానన్నారు.పవిత్ర రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా గత అయిదు ఏళ్లుగా మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు తో పాటు నా శక్తి మేర బిర్యానీ బాక్స్ లు అందిస్తున్నామని అన్నారు.రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు దాన ధర్మాలు చేస్తే పుణ్యం లభిస్తుందని అన్నారు.ప్రజలు ప్రతి ఒక్కరు ప్రతి పండుగల్లో వారికి చేతనైన సహాయం పేద ప్రజలకు ఇచ్చి ఆదుకోవాలన్నారు.ప్రతి ఏటా మనం చేసే వ్యాపారాల్లో,ఉద్యోగాల్లో ఎంతో కొంత దాచుకొని పండుగల సమయంలో పేదలకు సహాయం చేస్తే మనకు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ సోదరులు,టీడీపీ నాయకులు,కార్య కర్తలు పాల్గొన్నారు.
