రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం

నంద్యాల మండలంలోని అన్ని గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభమైందని మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా మండలంలోని భీమవరం, పులిమద్ది, పోలూరు గ్రామాలలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పరిశీలించారు. కార్యక్రమం భాగంగా గ్రామ స్థాయి బృందం గ్రామాలలోని రైతులను కలిసి వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో పాటించాల్సిన పంచ సూత్రాల గురించి వివరించారు.
అలాగే గౌరవ ముఖ్యమంత్రి సందేశం కలిగిన కరపత్రాలను రైతులకు అందజేసి వ్యవసాయ రంగంలోని సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ లో వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశాలపై రైతులకు వివరించి, వాటిని ఎదుర్కొనే వ్యవసాయ పద్ధతులపై సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది లలిత, రాము నాయక్, పల్లవి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Scroll to Top