సమాజంలో ప్రతి ఒక్కరు పేదలకు సహాయం చేయండి
100 మందికి జిఎం ఫర్నిచర్ షోరూం అధినేత గౌస్ బాషా రంజాన్ తొఫా పంపిణీ

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 16 :
నంద్యాల పట్టణంలో పవిత్ర రంజాన్ మాసంలో పేద ప్రజలకు రంజాన్ తొఫా పంపిణీ చేయడం దేవుడిచ్చిన వరమని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి,టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్ పేర్కొన్నారు.
నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోనీ జిఎం ఫర్నిచర్ యజమాని గౌస్ భాష ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి,ఎం.ఎం.డి.ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రంజాన్ పవిత్ర నెలలో పేద ప్రజలకు సహాయం దేవుడిచ్చిన వరం అన్నారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచాలని ఉద్దేశంతోనే రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిఎం ఫర్నిచర్ యజమాని కి అభినందనలు తెలిపారు.సమాజంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు తాము సంపాదించిన ఆదాయం లో 10 శాతం పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావడం శుభపరిణామం అన్నారు.జిఎం ఫర్నిచర్ షో రూమ్ అధినేత గౌస్ భాష మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేయాలని ఖురాన్ లో ఉందన్నారు.దేవుడి దయవల్ల నాకు కలిగిన దాంట్లో ప్రస్తుతం ఈ ఏడాది 100 మందికి పండుగకు అవసరం అయ్యే 21 నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని అన్నారు.ప్రతి ఒక్కరు వారు సంపాదించిన డబ్బు తో పడి మందికి సహాయం చేయాలన్నారు.దేవుడి దయతో ఈ ఏడాది 100 మందికి పంపిణీ చేస్తున్నానని ,వచ్చే రంజాన్ పండుగకు 300 మందికి పంపిణీ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పించాలని కోరారు.సేవా చేసే తృప్తి మరే దాంట్లో ఉండదన్నారు.ఈ కార్యక్రమంలో బుగ్గ రాముడు,బుగ్గ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
