నంద్యాలలో రెండు రోజుల టీవీ టెక్నీషియన్ శిక్షణా శిబిరం ప్రారంభం

  • ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయ సహకారంతో
  • శిక్షణ శిబిరం ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి ,డాక్టర్ రవి కృష్ణ,
  • టీవీ టెక్నీషియన్స్ సద్వినియోగం చేసుకోవాలి: మధుసూదన రెడ్డి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్, టీవీ టెక్నీషియన్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు
  • నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ నిర్వహణలో
  • శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నిపుణులు సయ్యద్ ఇక్బాల్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 14 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్, టీవీ టెక్నీషియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో, అమరావతి ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయ సహకారంతో,నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ నిర్వహణలో శనివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా టివి టెక్నీషియన్లకు రెండు రోజుల సాంకేతిక శిక్షణా తరగతుల శిబిరం ఘనంగా ప్రారంభమైంది.  ఈ సందర్భంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్, టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నిపుణులు సయ్యద్ ఇక్బాల్ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజలను చేసి శిక్షణ శిబిరం ప్రారంభించారు. ముందుగా టీవీ ని కనుగొన్న బైర్డ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ టీవీ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడం ద్వారా తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి టీవీ టెక్నీషియన్ కి ఇది గొప్ప అవకాశం అన్నారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక నైపుణ్య శిక్షణ పొంది టీవీలు రిపేర్ కి వచ్చినప్పుడు లోపం ఎక్కడుందో సరిగా గుర్తించి, సత్వరమే తయారు చేసి ఇవ్వడం ద్వారా టెక్నీషియన్స్ పై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు. టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యుల కుటుంబాలకు మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహిస్తామని, వారి సంక్షేమానికి, అభివృద్ధికి స్థానిక మంత్రివర్యులు ఎన్.ఎం.డి.ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లి  ప్రభుత్వ సహకారం అందేలా కృషి చేస్తామన్నారు.

టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన రెడ్డి, నంద్యాల జిల్లా సంఘం అధ్యక్షులు కన్నయ్య మాట్లాడుతూ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ముందుగా  కర్నూలు, నంద్యాల జిల్లాలలో ప్రారంభించడం సంతోషకరమన్నారు.

శిక్షణ ఇస్తున్న సాంకేతిక నిపుణులు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ టెలివిజన్ లు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతతో రూపాంతరం చెందుతున్నాయని తదనుగుణంగా వాటి గురించి అవగాహన పెంచుకోవడం ప్రతి టీవీ టెక్నీషియన్ కి ఎంతో అవసరం అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి,శిక్షణ ఇస్తున్న సాంకేతిక నిపుణులు సయ్యద్ ఇక్బాల్,రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ సంఘం అధ్యక్షులు కన్నయ్య, నంద్యాల టౌన్ సంఘం అధ్యక్షులు జయపాల్,ఆడియో విజువల్  సాంకేతిక నిపుణులు వెంకటేశ్వర రెడ్డి,ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయ  ప్రతినిధి సాగర్, సందీప్, శివ యాదవ్, వీరా రెడ్డి, రహీమ్ బైగ్, ఎల్లా గౌడ్ , , జిల్లా నలుమూలల  నుండి వచ్చిన రెండు వందల మంది పైగా టీవీ టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Scroll to Top