ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – వీధి దీపాల సమస్యను తీర్చిన టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 11 :

స్థానిక స్టేట్ బ్యాంక్ కాలనీలో యాసీన్ మసీద్ సందులో నెలకొన్న వీధి దీపాల సమస్యను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ చొరవ తీసుకుని పరిష్కరించారు. గత కొంతకాలంగా స్టేట్ బ్యాంక్ కాలనీ యాసీన్ మసీద్ సందులో వీధి దీపాలు లేక పోవడంతో స్థానిక ప్రజలు, ముస్లిం మైనార్టీ నాయకులు, మసీద్ సిబ్బంది మరియు వాకర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని వారు ఎన్ఎండి ఫయాజ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన అక్కడ కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించి, వీధి దీపాలను అమర్పించారు. ప్రజా సమస్యపై తక్షణమే స్పందించి పరిష్కరించినందుకు గాను, నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ని మరియు వాకా వరప్రసాద్ ని స్థానికులు, మైనార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ వాసుల ఇబ్బందులను గుర్తించి వెంటనే పరిష్కరించిన ఫయాజ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో లతీఫ్ భాష, మహబూబ్ బాషా, ఖాదర్ బాషా, ఇస్మాయిల్, మౌలానా జమాల్ రెహమాన్, మదర్ వలి, సల్మాన్ మరియు ఇతర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top