కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 11 :

అమరావతి లోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 6వ కలెక్టర్ల సదస్సులో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యత, జిల్లాల వారీగా ఎదురవుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సమావేశంలో పాల్గొని తమ సూచనలు, నివేదికను సమర్పించారు.

అమరావతిలో జరిగిన ఈ కలెక్టర్ల సమావేశం రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలు, జిల్లా పరిపాలనలో సమన్వయం పెంపు, ప్రజా సేవల మెరుగుదల దిశగా కీలకంగా నిలిచింది.

Scroll to Top