రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన నేపాలి గూర్ఖా కు శస్త్ర చికిత్స నిమిత్తం 80 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన ఆయుష్ యోగా , భారత్ వికాస్ పరిషత్ మరియు దాతలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 11 :

రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయిన నేపాలి నుంచి వచ్చి సిరివెళ్ల గ్రామంలో గుర్కా వృత్తి కొనసాగిస్తున్న 33 సంవత్సరాల కృష్ణకు నంద్యాల నెరవాటి హాస్పిటల్ నందు రేపు శస్త్ర చికిత్స చేయడం జరుగుతుంది.  ఈ సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు కండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం సిరివెళ్ల గ్రామం నుండి శస్త్ర చికిత్స నిమిత్తం నన్ను కలవగా నంద్యాల ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్ కందూరి ని కలవగా సిటీ స్కాన్ చేపించి పరిశీలించగా మోకాళ్ల వద్ద కట్ అయినది అని తెలిపారు,  దీనికి తప్పనిసరిగా ఆపరేషన్ చేసి నయం చేయవలసింది కానీ ఒట్టి కట్టు ద్వారా నయం కాదని తెలిపారు, ఈ విషయాన్ని యోగా సభ్యులకు, భారత్ వికాస్ పరిషత్ సభ్యులకు మరియు సోషల్ మీడియాలో స్టేటస్ లో ప్రచురించగా సుమారు 120 మంది దాకా స్పందించి 70 వేల రూపాయలు అకౌంట్ లో వేశారు, అలాగే నా వంతు సహకారంగా ₹10, 116 మరియు దాతల సహకారంతో అకౌంట్లో పడిన 70 వేల రూపాయలను ఈరోజు ఎస్బిసిఐ మల్లికార్జున గుప్తా చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్బిసిఐ మల్లికార్జున గుప్త మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు నుంచి యోగాతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇప్పుడు దేశం కానీ దేశం నుంచి వచ్చిన నేపాల్ వాసి కృష్ణకు కాలు విరిగిన విషయం తెలుసుకొని కండె ఆనంద్ గురూజీ బాధ్యతలు తీసుకుని గత రెండు రోజుల నుండి ఎవరికి భారం లేకుండా కేవలం 500 రూపాయలు చెల్లిస్తే గూర్ఖా అతని వృత్తి కొనసాగించుకుంటాడని సోషల్ మీడియాలో ప్రచురించడంతో అనేకమంది స్పందించి ముందుకు వచ్చినందుకు దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ బాధితులకు నా వంతు సహకారం కూడా అందిస్తానని తెలిపి, ఇంకనూ తక్కువైన మొత్తాన్ని మిగిలినవారు వీరిని ఆదర్శంగా తీసుకుని మానవత్వంతో ముందుకు వచ్చి సహకారం అందించవలసిందిగా కోరుకుంటూ ఖండే ఆనంద్ గురూజీని అభినందించారు.  ఇంకనూ సుమారు 70 వేల రూపాయలు పైన ఆపరేషన్కు మరియు మూడు నెలలకు పైగా గూర్ఖా కు పూట గడవడం కొరకు నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం ఉన్నది,  సహకారం అందించిన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకను అవసరమైన మొత్తం కొరకు స్పందించి సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాము అని ఆనంద్ గురూజీ తెలియజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ కండే శ్యాంసుందర్లాల్ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం ఆనంద్ గురూజీ భారత్ వికాస్ పరిషత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే సుమారు 12 లక్షల రూపాయలతో దాతల సహకారంతో కృత్రిమ దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేయడం మరియు కుట్టు మిషన్లు సైకిళ్లు గ్రైండర్లు అందజేసిన విషయం అందరికీ తెలిసింది ఇప్పుడు మరలా పొట్టకూటి కొరకు నేపాల్ నుండి వచ్చి సిరివెళ్ల గ్రామంలో కృష్ణ అనే యువకునికి కాలు విరగడంతో దాతలకు తెలియజేసి సుమారు 70 వేల రూపాయలు వసూలు చేయడమే కాక తన సొంత డబ్బులు 10000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్న కండే ఆనంద్ గురూజీని అభినందిస్తూ గుర్కా కృష్ణకు ఆపరేషన్ విజయవంతమై తన వృత్తిని చక్కగా కొనసాగించుకోవాలని కోరుకున్నారు .

ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ ప్రధాన కార్యదర్శి కూరాకు వీరాంజనేయ ప్రసాద్ జెట్టి వెంకటేశ్వర్లు మంచికంటి వెంకటేశ్వర్లు నాగేల్ల నాగరాజు గంతి తానేష మందుల సురేష్ ఉల్లి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.దాతలు ఎవరైనా సహాయం అందించాలనుకుంటే 9989983673 కి ఫోన్ పే చేయగలరు.

Scroll to Top