
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 04:
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండిఆత్మకూరు మండలం చిన్నదేవలాపురం గ్రామం నందు ఇటీవల జరిగిన అగ్నిప్రమాద బాధితుడు షేక్ మాభు కుటుంబాన్నీ పరామర్శించిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల సురేష్ రెడ్డి, బేడా బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి,నంద్యాల 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు. ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు బాధిత కుటుంబానికి కంచర్ల సురేష్ రెడ్డి చేతుల మీదగా స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, స్థానిక మంత్రి వర్యులు ఎన్ఎండి. ఫరూక్ ఆదేశాల మేరకు 20వేల రూపాయలు నగదు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాటికొండ బుగ్గరాముడు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపుగా 10బర్రెలు అక్కడికి అక్కడే మృతి చెందడం జరిగింది మరో10 బర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి వాటికి మెరుగైన వైద్య ఖర్చుల నిమిత్తం 20వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బాదిత కుటుంబ సభ్యులు మరియు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
