- భగవద్గీతను కించపరిచే విధంగా మాట్లాడిన టిటిడి చైర్మెన్ ను పదవినుంచి తొలగించాలి
- బీసీ సింహగర్జన లో డిమాండ్ల పరిష్కారం చేయకపోతే ఏప్రిల్ 10 ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
- బడ్జెట్లో రాయలసీమ ప్రజక్తులకు ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు
- రాయలసీమ ప్రాజెక్టులు ఉన్నా రైతులకు నీరు లేకపోవడం దురదృష్టకరం
- జిల్లాలో కూటమి నేతలు ఇసుక, మైనింగ్, లిక్కర్ వ్యాపారాల్లో బిజీ
- బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 04:
కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పై టీడీపీ నాయకులు చేస్తున్న రాజకీయం సిగ్గుచేటని, భగవద్గీత ను కించపరిచే విధంగా మాట్లాడిన టిటిడి చైర్మెన్ ను పదవినుంచి తొలగించాలి అని, రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్ లో పైసా నిధులు విడుదల చేయకుండా రైతులను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని బిసివై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. రాయలసీమ ప్రాంతంలో పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రైతుల పంటలకు సరైన నీరు అందించడంలో టీడీపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని తీవ్రంగా ఆరోపించారు. నంద్యాల జిల్లాలో అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఇసుక, మైనింగ్, లిక్కర్ వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు.
నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నంద్యాల పట్టణంలోని చాణక్య లాడ్జి సమావేశ భవనంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర, కుందూ నదులు ప్రవహిస్తున్నా ఆ నీటిని రైతులకు ఉపయోగపడేలా సంరక్షించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కేసీ కెనాల్ ఆధునికీకరణ పనులు సక్రమంగా జరగకపోవడంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని విమర్శించారు. ప్రతి సంవత్సరం వరదల సమయంలో వేలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతున్నా, ఆ నీటిని నిల్వ చేసేందుకు లేదా సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాయన్నారు.
మహా పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది వంటి ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో ప్రజా ప్రతినిధులు దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సెజ్ కింద నిధులు మంజూరు చేసిన ఓర్వకల్లు ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడంలో కూడా టీడీపీ నాయకులు విఫలమయ్యారన్నారు. నంద్యాల జిల్లా వెనుకబాటుతనానికి కారణం ఎవరో ప్రజలకు బాగా తెలుసని అన్నారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యవహారాల్లో కూడా కొందరు టీడీపీ నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీకి అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే బీసీ సింహగర్జనలో ప్రకటించిన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఎన్నికల హామీ మేరకు బీసీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని, అమరావతిలో బీసీల అభివృద్ధి కోసం వెయ్యి ఎకరాలు కేటాయించాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీల అభివృద్ధికి వారి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని, అందుకోసం జనగణనలో కులగణన చేపట్టాలని అన్నారు.
బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెస్ ఛార్జీలు సరిపోవడం లేదని, వాటిని పెంచాలని, బీసీ కార్పొరేషన్‌కు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను మార్చి 30వ తేదీలోగా నెరవేర్చాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ ప్రభుత్వం 3 లక్షల 32 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టినా రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క పైసా నిధులు విడుదల చేయకుండా రైతాంగాన్ని మోసం చేసిందని విమర్శించారు. తెలుగుగంగ మరమత్తులు,అదురికరణ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని అన్నారు.రాయలసీమ వనరులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బిసివై పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తున్నారు.రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ,టీడీపీ పార్టీలు స్వలాభం చూసుకున్నారు కానీ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చి 20 నెలల్లో ఏమిసడించారని ప్రశ్నించారు.పరిశ్రమల పేరుతో భూములు బినామీల దోచిపెడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.దేశంలో ఆపద్ధాలు ఆడడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ప్రావీణ్యం ఎవరికి లేదన్నారు.కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం పై ఆరోపణలు చేస్తూ నిచరాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.రాష్ట్ర సమస్యలపై మాట్లాడకుండా తిరుమల వివాదం ముగించకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా రోజుకో ఆరోపణలు చేస్తూ కాలం వెల్లడిస్తున్నారన్నారు. ఇటీవల టిటిడి చైర్మెన్ పై ఆరోపణలు వస్తె నిరూపించుకోకుండా భగవద్గీతపై కించపరిచే విధంగా మాట్లాడిన చైర్మెన్ ను పదవి నుంచి తొలగించి, కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. టిటిడి చైర్మెన్ పదవి ప్రధాని, ముఖ్యమంత్రి పదవుల కంటే పవిత్రమైంది అన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నించేవారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని అన్నారు.బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఘోరంగా టీడీపీ పాలన చేస్తుందని దుయ్యబట్టారు. వైసిపి,టీడీపీ రెండు పార్టీల దోపిడీని ప్రశ్నించే పార్టీ బిసివై పార్టీ అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. వైసిపి, టీడీపీ పార్టీలు బీసీ లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ సింహ గర్జనలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడితే నా పై తప్పుడు ఆరోపణలు చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. నా వెనుక ఏ పార్టీ సపోర్ట్ లేదని స్పష్టం చేశారు. రాజకీయంలో టీడీపీ ప్రభుత్వం 40 ఏళ్లలో రాజకీయం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును పదవిచుత్యుడిని చేసి ఆపద్ధాలలో పేటెంట్ హక్కు పొందిన నేతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని ఆరోపించారు. వంగవీటి మోహన్ రంగాను కొందరు నేతలు హత్య చేశారని నేను మాట్లాడితే వక్రీకరించి నాపై ఆరోపణలు చేశారన్నారు. వంగవీటి మోహన్ రంగాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీనే హత్య చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల డిమాండ్స్ టీడీపీ పార్టీ నెరవేర్చే బాధ్యత ఉందని, బీసీల రక్షణ చట్టం, అమరావతిలో బీసీ లకు వెయ్యి ఎకరాలు, 44 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు చేయలేదని కాణిపాకం వినాయకునిపై ఒట్టు వేసి చెప్పగలరా, నేను చేస్తాను మీరు చేయగలరా అని సవాల్ విసిరారు. బీసీ సింహగర్జనలో బీసీల అయిదు డిమాండ్లయిన బిసిలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిసి అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని, అమరావతిలో బిసిల అభివృద్ధి కొరకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బిసిలకు 44 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, బిసిలు అభివృద్ధి చెందాలంటే, వారి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని, కావున తప్పనిసరిగా జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి హాస్టళ్ళలో విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న మెస్ చార్జీలు ఏ మాత్రం చాలడం లేదని, వాటిని పెంచాలని, ఈ డిమాండ్స్ ఈ నెల 31లోపు పరిష్కరించకుంటే ఏప్రిల్ 10 న ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీవై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు నాగేశ్వరరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఎస్. రఘురాముడు యాదవ్, గంగవరం యాదవ సంఘ నాయకులు సాంబశివుడు, మహేష్, ఉమ్మడి జిల్లా నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
