పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయం – ఎన్ఎండి ఫిరోజ్




సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి మార్చి 01:
పేద వారు కూడా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో నంద్యాల జమీయతే ఉలేమా హింద్ మరియు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రంజాన్ ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం నంద్యాలలో ఘనంగా జరిగింది. ఆలమీ సదర్ జమీయత్ ఉలమా ఎ హింద్ హజ్రత్ మౌలానా అర్షద్ మదని సాహెబ్ దామత్ బర్కాతుహుం సుబే ఆంధ్ర తెలంగాణ సదర్ హజరత్ మౌలానా ముఫ్తీ గయాసుద్దీన్ సాహెబ్ రెహ్మానీ వ ఖాస్మీ దామత్ బర్కాతుహుం సుబే ఆంధ్ర తెలంగాణ జనరల్ సెక్రటరీ హజరత్ మౌలానా ముఫ్తీ మెహమూద్ జుబేర్ ఖాస్మీ దామత్ బర్కాతుహుం వారి యొక్క మార్గదర్శకత్వంలో నంద్యాల కుబ్రా మసీదు నందు జిల్లా ఇమాముల సంఘం మరియు జమీయతే ఉలేమా హింద్ అధ్యక్షులు మౌలానా అంజద్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పేద కుటుంబాలకు 150 రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు తోడ్పాటు అందించడం గొప్ప విషయమని ఎన్ఎండి ఫిరోజ్ కొనియాడారు.
సంస్థల సేవలు: జమీయతే ఉలేమా హింద్ సంస్థ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుందని, వారి సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి పేద ముస్లిం సోదరుడు పండుగ పూట ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ కిట్లను అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జమీయతే ఉలేమా హింద్ ప్రతినిధులు అబూబకర్ సిద్ధిఖీ సాహెబ్, మౌలానా మెహబూబ్ బాషా సాహెబ్, మౌల్వి అబ్దుల్ రావుఫ్ సాహెబ్, హాఫీజ్ అబ్దుల్ సలాం సాహెబ్, హాజీ ఇలియాస్ సాహెబ్ చాబూల్, హాఫీజ్ అబ్దుల్ రజాక్ ,హాఫీజ్ అబ్దుల్ రెహమాన్, హాఫీజ్ ఖాజా, మౌలానా జబీహుల్లా, మౌలానా అబ్దుల్ కలాం, హాఫీజ్ అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు
