నంద్యాలలో ఘనంగా “శ్రీ వేంకటేశ్వర చెక్క గానుగ నూనెల” షాప్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ , తులసి రెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి మార్చి 01:
నంద్యాల నగరంలో రాజ్ టాకీస్ కాంప్లెక్స్ లో సిరిగిరి రంగస్వామి నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీ వేంకటేశ్వర చెక్క గానుగ నూనెల” కేంద్రాన్ని ఆదివారం నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్, తులసి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కల్తీ నూనెల వల్ల కలిగే అనర్థాలను నివారించేందుకు ఇలాంటి స్వచ్ఛమైన గానుగ నూనెలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో చెక్క గానుగ ద్వారా తీసిన సన్‌ఫ్లవర్, ఆవాల, ఆముదము మరియు కొబ్బరి నూనెలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇక్కడ పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో నూనెల తయారు చేస్తారని సన్‌ఫ్లవర్ (పొద్దుతిరుగుడు) నూనె, ఆవాల నూనె. ఆముదము మరియు బళ్లారి కొబ్బరి నూనెలు లభించునని . ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన వేరుశనగ నూనె ఇక్కడ లభించడం సంతోషదాయకమన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి నూనెలను వాడాలని ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాపు నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Scroll to Top