ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండే.శ్యాం సుందర్ లాల్
యూనియన్ లకు అతీతంగా ఘన నివాళలు ఆర్పిపించిన నంద్యాల జర్నలిస్టులు


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 28:
మాదాల శ్రీనివాసులు మన మధ్యలో లేడని ఉహించుకోవడానికే బాధగా ఉందని, ఆయన లేని లోటు జర్నలిస్టులకు, సమాజానికి తీరని లోటని, జర్నలిజం విలువలకు కేరఫ్ అడ్రస్ అని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండే. శ్యాం సుందర్ లాల్, పలువురు సీనియర్ పాత్రికేయులు అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఏపీ ఎన్ జి ఓ అసోసియేషన్ కార్యాలయంలో జర్నలిస్ట్ సంఘాలకు అతీతంగా ఏర్పాటు చేసిన మాదాల శ్రీనివాసులు సంస్మరణ సభలో నంద్యాల పట్టణంలోని జర్నలిస్టులు పాల్గొని ఆయనకు ఘన నివాళ్లు అర్పించారు. సీనియర్ జర్నలిస్ట్ లు ప్రభాకర్ రెడ్ది, శశిశేఖర్ శర్మ, ఖండే శ్యాం సుందర్ లాల్, చలం బాబు, యం. వి.రమణారెడ్డి, రాజకుమార్ రెడ్ది, సూర్య మధు, కంభం సతీష్ తో పాటు ప్రజాశక్తి రిపోర్టర్ మౌలాలి, ఎన్ టి వి నాగప్రసాద్, నంది పత్రిక జిల్లా బ్యూరో వెంకట్ తదితరులు ముందుగా మాదాల శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ రెడ్ది మాట్లాడుతూ మాదాల శ్రీనివాసులు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. తాను జర్నలిస్ట్ గా వచ్చినప్పుడు తనకు మంచి గుర్తింపు రావడానికి ప్రోత్సహించిన వారిలో మాదాల శ్రీనివాసులు ఒక్కరన్నారు. ఆయనలో ఓర్పు సహనం ఎక్కువని, ఏ అంశం రాసిన చాలా క్లారిటీగా, స్పష్టంగా, సరళంగా వార్త రచన పాఠకులకు అర్థమైయో రీతిలో ఉండేదాన్నారు. మాదాల శ్రీనివాసులు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చుకాని ఆయన ఆశయాలు మన మధ్యలోనే ఉన్నాయని, శ్రీనివాసులు లేని లోటు జర్నలిస్ట్ సమాజానికి తీర్చలేనిదని కౌన్సిలర్, సీనియర్ జర్నలిస్ట్ ఏపీ యూ డబ్ల్యూ జే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండే శ్యాం సుందర్ లాల్ అన్నారు. తాను కౌన్సిలర్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడినప్పుడు మాదాల శ్రీనివాసులు నైతికంగా ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నెట్టేవారన్నారు. ఎప్పుడు కూడా కోపం అనేది ఆయన మెహంలో చూడలేదని ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ అందరిని ఆప్యాయంగా పలుకరించేవారన్నారు.జర్నలిస్ట్ గా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సింపుల్ గా ఉండేవారని శ్రీనివాసులు సేవలను శ్యాం సుందర్ లాల్ గుర్తు చేశారు. మాదాల శ్రీనివాసులు కుటుంబానికి జర్నలిస్టులు అండగా ఉంటారని తెలిపారు.రాష్ట్ర మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో మాట్లాడి మాదాల శ్రీనివాసులు కు సంబందించిన మెడికల్ బిల్లులు ను సీఎం సహాయ నిధి కింద వచ్చేలా కృషి చేస్తామన్నారు.
సీనియర్ జర్నలిస్ట్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నంద్యాల జిల్లా గౌరవాద్యక్షులు శశిశేఖర్ శర్మ మాట్లాడుతూ అందరితో సంఖ్యంగా ఉంటూ ఎవ్వరిని నొప్పించకుండా మాదాల శ్రీనివాసులు ఉండేవరన్నారు. ఇటీవల నే 60 ఏళ్లు దాటినా సీనియర్ జర్నలిస్టులంతా కలుద్దామని అనుకున్నామని అందుకు మాదాల శ్రీనివాసులు ముందుకొచ్చి అందరిని ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో మనమధ్య లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు మాట్లాడుతూ మాదాల శ్రీనివాసులు తో సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. ఆయన ప్రజాశక్తి లోను, తాను విశాలాంధ్ర పత్రికలో పని చేసే సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. నిబద్దత కలిగిన వ్యక్తిగా, విలువలతో జర్నలిజంలో కొనసాగరన్నారు.
ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ జర్నలిజం విలువలకు మాదాల శ్రీను అన్నారు. మాదాల శీను చిరునవ్వుతోనే అందరి మన్నలను పొందారున్నారు. ప్రస్తుతం ఉన్న పాత్రికేయులు మాదాల శీను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవడం అన్నది మాదాల సేవించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నారు.
ప్రజాశక్తి రిపోర్టర్ మౌలాలి మాట్లాడుతూ కలమే ఆయుధంగా పాలకుల విధానాలను ఎండగడుతూ తన చివరి తుది శ్వాస వరకు అనుకున్న లక్ష్యం కోసం నిలబడిన వ్యక్తిగా మాదాల శ్రీనన్న ఉన్నారన్నారు.నిబద్దత, విలువలకు కట్టుబడి జర్నలిజంలో మచ్చలేకుండా జీవించారన్నారు.ఆయన ఏ సమాజం కోసం పాటుపడ్డారో ఆ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని, జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు యం. వి. రమణారెడ్డి మాట్లాడుతూ మాదాల శ్రీనివాసులు ఏపీయూ డబ్ల్యూ జేలో ఉన్న సమయంలో నంద్యాల పట్టణంలో ప్రెస్ క్లబ్ కు మొదటి అధ్యక్షులు గాను ఉండగా తాను కార్యదర్శిగా ఇరువురం కలిసి పని చేసిన జ్ఞాపకాలను గుర్తు చేశారు. కాలక్రమంలో ఏపీ యూ డబ్ల్యూ జే నుండి ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ వ్యవస్థాపకుల్లో ఒక్కరుగా ఉన్నప్పటికీ జర్నలిస్టుల ఐక్యత కోసం కృషి చేశారన్నారు. అలాంటి వ్యక్తి మనమధ్యలో లేకపోవడం బాధ కలిగిస్తుందన్నారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రీ పబ్లిక్ పత్రిక ఎడిటర్ నాగేంద్ర, శిల్పా సిటీ కేబుల్ రిపోర్టర్ చార్లెస్, టీవీ 9 సాయివర్మ, బిగ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ రాజశేఖర్, మీడియా ఫొటో గ్రాఫర్ చింతలపల్లి వాసు, జర్నలిస్ట్ లు మాలిక్, అబ్రహం, శివ, అల్లాబకస్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
