జిల్లాలోని అన్ని కోర్టులలో పోలీస్ అధికారులు విస్తృత తనిఖీలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 28:
తెలుగు రాష్ట్రాలలో వివిధ కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో భద్రతాపరంగా పోలీసు అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది. 
కోర్టులలో ప్రజలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు,మీడియా వారు, కక్షిదారులు,నిందితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రదేశాలు కావడం వల్ల భద్రతా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కావున పోలీసు బలగాలు కోర్టు ప్రహరీ గోడలు, కోర్టు ప్రాంగణాలను మరియు అనుమానం ఉన్న ప్రదేశాలను అణువణువునా తనిఖీ చేయడం జరిగింది. 
కోర్టు ప్రవేశ నిష్క్రమణ ప్రాంతాలలో మరియు కోర్టు పరిసర ప్రాంతాలలో సి సి కెమెరాలను తనిఖీ చేయడంతో పాటు వాటి పర్యవేక్షణ పై అరా తీయడం జరిగింది.
అనుమానాస్పద వస్తువులు కానీ ఆయుధాలు కానీ వ్యక్తులు కానీ లోపలికి రాకుండా తనిఖీలు నిర్వహించాలి. 
ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు ఆర్ అండ్ బి అధికారులు కోర్టు భవనాల భద్రతపై తనిఖీలు నిర్వహించడంతో పాటు ఎలక్ట్రికల్ అధికారులు షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. మరియు ఫైర్ శాఖకు సంబంధించి కోర్టులలో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ పై తనిఖీలు నిర్వహించడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు, కోర్టు వారు,మునిసిపల్, ఫైర్ ,ఎలక్ట్రికల్ ,ఆర్ అండ్ బి అధికారులు పాల్గొని తనిఖీలు నిర్వహించడం జరిగింది.

Scroll to Top