రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై మండలి సమావేశంలో ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా నిలదీశిన వైసిపి ఎమ్మెల్సీలు ఇస్సాక్ బాషా,రామసుబ్బారెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 28:
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై మండలిలో ఘాటు విమర్శలు..
మండలిలో జరిగిన చర్చ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వైసిపి ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. “రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పడు పూర్తి చేస్తారు?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, ఇరిగేషన్ మంత్రి పొంతనలేని, స్పష్టతలేని సమాధానాలు ఇచ్చారని మండిపడ్డారు.
రాయలసీమ ఎడారిగా మారుతున్న పరిస్థితి కూటమి నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మండలిలో ప్రశ్నించగా, దానిపై సరైన సమాధానం లేదు, రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు….

చంద్రబాబు వైఖరిపై తీవ్ర విమర్శలు:
ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలుస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు వస్తుందనే భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారా? అని ప్రశ్నించారు.
రాయలసీమ రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, రేపు కడపలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వియవంతం చేయాలని కోరుతూ..
“రాయలసీమ అభివృద్ధి కోసం, రైతుల భవిష్యత్తు కోసం మనమంతా ఒకటిగా నిలబడాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

Scroll to Top