పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి ఫరూక్
పురపాలక పాఠశాల విద్యార్థులకు భారీ బహుమతి ప్రకటన 585 మార్కులు సాధిస్తే 3 గ్రాముల బంగారు బహుమతి ప్రకటించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 28:
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ శనివారం నంద్యాల టేక్కేలోని పురపాలక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని వసతులను, విద్యాబోధనను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల సందర్శనలో భాగంగా మంత్రి ఫరూక్ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని, భోజనం విషయంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. త్వరలో జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో, మంత్రి ఫరూక్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు విద్యార్థులను పలకరించి, పరీక్షలకు సిద్ధమవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారికి ‘ఆల్ ది బెస్ట్’ తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, పట్టుదలను పెంచేందుకు మంత్రి ఫరూక్ ఒక అద్భుతమైన ప్రకటన చేశానని తెలిపారు . “నంద్యాల నియోజకవర్గంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో చదువుతూ, 2026 పదవ తరగతి ఫలితాల్లో 585 మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఒకరికి (మహిళా విద్యార్థినికి) 3 గ్రాముల బంగారాన్ని బహుమతిగా అందజేస్తాం.” అని తెలిపారు . ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా ప్రతిభ చాటాలనే ఉద్దేశంతోనే ఈ బహుమతిని ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
