నంద్యాల లో బైక్ దొంగ అరెస్ట్

ఐదు మోటార్ సైకిళ్లు స్వాధీనం..వాటి విలువ సుమారు1,80,000 రూపాయలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 25:
నంద్యాల మూడవ పట్టణ పోలీస్ అధికారులకు రాబడిన సమాచారం మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ  ఎం.జావళి ఉత్తర్వుల మేరకు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ  ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ నాగేంద్రప్రసాద్ మరియు సిబ్బంది సహాయంతో బొమ్మలసత్రం రామలింగారెడ్డి డిగ్రీ కాలేజీ దగ్గర మదర్ వలి అనే వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతు ఉంటే అతని పట్టుకుని విచారించగా ఈ మధ్యకాలంలో పనికి పోతే వచ్చే డబ్బులు సరిపోక జల్సాల కోసము నేను బైక్ దొంగతనం చేసినాని ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి దొంగిలించబడిన 5 మోటార్ సైకిల్ లను రికవరీ చేయడం జరిగింది.
ఈ బైకుల్లో మూడు 3టౌన్ పరిధిలో సంబంధించినవి రెండు తాలూకా పరిధిలో దొంగిలించబడినవిగా గుర్తించి రికవరీ చేయడం జరిగింది. వీటి మొత్తం విలువ సుమారుగా1,80,000 ఉంటుందని అంచనా. అనంతరం తదుపరిచర్య నిమిత్తం ముద్దాయిని జుడిషియల్ రిమాండ్ పంపడమైనది

Scroll to Top