ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ భాషా

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 25:
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాలమేరకు నంద్యాల పట్టణ కేంద్రంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ భాషా  ఆధ్వర్యంలో  అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  నూనెపల్లి, బొమ్మలసత్రం మరియు హైవేలలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపి రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హైవేలలో ప్రయాణించే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఇది మీ యొక్క భద్రత కొరకేనని గుర్తించాలన్నారు.

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయని కావున ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలన్నారు. 

 ట్రాఫిక్ నిబంధనలు :

మోటార్ సైకిల్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి..
మద్యం సేవించి వాహనాలు నడపరాదు..
మోటార్ సైకిల్ పై త్రిబుల్ రైడింగ్ చేయరాదు..
అతివేగంగా వాహనాలు నడపరాదు..
మైనర్లు వాహనాలు నడపరాదని.
ఆటోలలో పరిమితికి మించి సరుకులను ప్రయాణికులను చేరవేయరాదు.
పై నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని ఆకాంక్షించారు. 

Scroll to Top