
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 25:
నంద్యాల పట్టణం బొమ్మల సత్రం లోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ కార్యాలయంలో ఇటీవల నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నిర్వహించిన ప్రజా దర్బార్‌లో చిన్నారి పునర్విక తల్లితండ్రులు తమ కుమార్తె అరుదైన వ్యాధితో బాధపడుతుందని, వైద్యం కోసం సహాయం కోరుతూ నా దృష్టికి తీసుకువచ్చారనీ. వారి ఆవేదనను విని వెంటనే స్పందించి, పునర్వికకు అవసరమైన వైద్య సహాయం తప్పకుండా అందిస్తామని భరోసా ఇచ్చాననీ, నా ప్రయత్నాల ఫలితంగా పునర్విక చికిత్స కోసం ప్రధాని సహాయ నిధి నుంచి రూ.50 లక్షల ఆర్థిక సహాయం మంజూరైందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి బుధవారం అన్నారు. ఇది పునర్విక కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చే విషయమని, ఈ సహాయం సాధ్యమయ్యేలా సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర వైద్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని.
ప్రజల ఆరోగ్యం నా మొదటి బాధ్యత అంటూ చిన్నారి పునర్విక త్వరగా కోలుకుని ఆరోగ్యంగా జీవించాలనే ఆకాంక్షతో, ఆమె కుటుంబానికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భరోసా ఇచ్చారు.
