రజకుల సంక్షేమానికి బిజెపి భరోసా – బిజేపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు 

 
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 23:
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఓబీసీ అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో సంత్ గాడ్జ్ బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మదు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అభిరుచి మదు మాట్లాడుతూ రజకుల సంక్షేమం కోసం బిజెపి పార్టీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతే బిజెపి లక్ష్యమని, రజకుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. రజకుల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన పురోగతికి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో బిజెపి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రజకుల హక్కుల పరిరక్షణకు, వారి స్వాభిమానానికి బిజెపి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని అభిరుచి మదు స్పష్టం చేశారు. సంత్ గాడ్జ్ బాబా సేవా స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జిల్లా ఓబీసీ అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ సంత్ గాడ్జ్ బాబా సామాజిక సమానత్వానికి ప్రతీక అని కొనియాడారు. ఆయన బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకమని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు, రజక సంఘం ప్రతినిధులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top