- భారతీయ సంస్కృతికి పల్లెలే పట్టుకొమ్మలు
- ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్చిన భాద్యత అందరిపై ఉంది.
- మహిళలను రాజకీయంగా ప్రోత్సహించాలి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 20 :
భారతీయ సంస్కృతికీ పల్లెలే పట్టుకొమ్మలు అని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాల్చిన భాద్యత అందరిఫై ఉందని, తిరుపతి లడ్డును కల్తీ చేసి ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ నాయకులను ప్రజలు నమ్మరని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామంలో బైరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో, వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ పర్యవేక్షణలో వైభవంగా శ్రీ చౌదేశ్వరీదేవీ, శ్రీ మశమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాల ప్రారంభం, అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్ట వేడుకగా నిర్వహించారు.
గ్రామ దేవతలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన భార్య బైరెడ్డి భారతమ్మ, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన భార్య బైరెడ్డి శ్రీలత, కూతురు బైరెడ్డి అనూషారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు తదితరులు విశేష పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ మా గ్రామం ముచ్చుమర్రిలో నాలుగు తరాలుగా మా బైరెడ్డి వంశం పెద్దలు గ్రామాభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారన్నారు. మా కుటుంబం లోనే కొందరు స్వార్థంతో గ్రామఅభివృద్ధి విరోధకులుగా మారారని, వారి ఆలోచన మారి కుటుంబంతో కలిసివచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుదామని పరోక్షంగా వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం వల్లే అనేక అనర్థాలు గ్రామాల్లో నెలకొన్నాయని అన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ముచ్చుమర్రి గ్రామంలో గత వైసీపీ ఐదేళ్ళ పాలనలో విధ్వంసంకు గురైందని, గ్రామ పెద్దగా, కుటుంబ పెద్దగా గ్రామాన్ని బాగుచేసుకునే ఉన్నామని, గ్రామం బాగుంటే దేశం బాగుంటుందని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. కుల మతాల ఐక్యత గ్రామ అభివృద్ధి ఎంతో ఉపయోగం అన్నారు. స్థానిక వైసీపీ నాయకులకు గ్రామాల అభివృద్ధి ఇష్టం లేదేమో అన్నారు.
మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించినప్పుడే దేశం బాగుపడుతుందని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మీ అందరి దీవెనల వల్లే మా తాత బైరెడ్డి చిన్న శివారెడ్డి, మా నాన్న బైరెడ్డి శేషశయనారెడ్డిలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లుగా విజయం సాధించి చరిత్ర సృష్టించారని, తాను రెండు సార్లు ఎమ్మెల్యే గా సేవలు అందించానని, ప్రస్తుతం నంద్యాల ఎంపీ గా డాక్టర్ బైరెడ్డి శబరి కూడా ఈ ముచ్చుమర్రి గ్రామ బిడ్డనే అన్నది మరువవద్దాన్నారు. మీ అందరి సహకారంతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నీతివంతంగా, నిరంతరం ప్రజాసేవ చేస్తుందని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
