కృష్ణానదిలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు పడవలో విహార యాత్ర

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 20 :

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న కృష్ణానదిలో శుక్రవారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివచరణ్  రెడ్డిలు పడవలో విహార యాత్ర చేశారు.

బైరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో, వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ పర్యవేక్షణలో వైభవంగా శ్రీ చౌదేశ్వరీదేవీ, శ్రీ మశమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాలు, విగ్రహాల ప్రతిష్ట  నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం  గ్రామానికి చెందిన తిక్కస్వామి, వెంకటేశ్వర్లు ల పడవతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ని చూసేందుకు ఏటి అవతలి ఒడ్డు నుంచి పడవతో  ఇవతలికి వచ్చారని తెలుసుకున్నారు. వారి విన్నపం మేరకు పడవలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డి లు విహరించారు.

Scroll to Top