- అండగా ఉండి,ఎంత దూరమైనా వెళ్ళి అండగా ఉంటా
- మున్సిపల్ అధికారుల లీలలు బహిర్గతం
- ల్యాండ్ కన్వర్షన్ లేని స్థలానికి విఎల్టీ వేసిన ఘనులు
- నాడు మంత్రి ఫరూక్ స్థలానికి మరొకరికి విఎల్టీ వేయడంతో ముగ్గురు అధికారులు సస్పెండ్
- గెలివి,బద్రిశెట్టి కుటుంబాలకు చెందిన స్థలం కు మరొకరి పేరుతో విఎల్టీ




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 17 : నంద్యాల మున్సిపల్ అధికారులు మరో ఘన కార్యం సాధించిన విషయం బట్టబయలు అయింది. రాష్ట్ర చరిత్రలో మరో చరిత్ర సృష్టించారు. ఒక స్థలానికి ల్యాండ్ కన్వర్షన్ లేని స్థలానికి విఎల్టీ వేయడంతో గొడవలకు కారణం అయింది. గతంలో పద్మావతి నగర్లో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ స్థలం కు సంబంధించి మరొకరి స్థలం అని వారికి విఎల్టీ వేయడంతో అధికారుల గుట్టు రట్టు కావడంతో మున్సిపల్ రెవెన్యూ విభాగంలోని ముగ్గురు అధికారులు సస్పెండ్ అయినా విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భారీ స్థాయిలో డబ్బులు తీసుకొని విఎల్టీ వేసినట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మరో సారి గెలివి,బద్రిశెట్టి కుటుంబాలకు చెంది 75 సెంట్ల స్థలము కు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ స్థలం కొట్టేయడానికి మున్సిపల్ అధికారులతో కుమ్ముక్కుఅయి ఆ స్థలం ల్యాండ్ కన్వర్షన్ కాకపోయినా విఎల్టీ ఇవ్వడంతో సంచలనంగా మారిపోయింది. స్థల సమస్య ఉండడంతో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నీ గెలివి,బద్రిశెట్టి కుటుంబాలు కలవడంతో భూమా అక్కడికి వెళ్లి విచారణ చేస్తే మున్సిపల్ అధికారుల బండారం బయటపడింది. వివరాల్లోకి వెళితే గెలివి,బద్రిశెట్టి కుటుంబాల పెద్దలు 1984 లో చాబోలు రాస్తా లో 75 సెంట్లు కొనుగోలు చేశారు. ఆ స్థలం పై కొందరు కన్నువేశారు. గత ఆరునెలల క్రితం కొందరు వ్యక్తులు ఆ స్తలం మాదే అంటూ దౌర్జన్యంగా కాంపౌండ్ వాల్ పగలగొట్టి వారిపై గొడవకు దిగి దాడి చేశారు. అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు.అప్పటినుంచి సైలెంట్ గా ఉన్నవారు మున్సిపల్ అధికారుల వద్ద ల్యాండ్ కన్వర్షన్ కానీ,ఎలాంటి పత్రాలు కానీ లేకుండా ఆ స్థలానికి విఎల్టీ వేయించుకున్నారు. విఎల్టీ వేయించుకున్నారని గెలివి,బద్రిశెట్టి కుటుంబాలు న్యాయం కోసం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నీ కలిశారు.మంగళవారం ఉదయం అవతలి వర్గం మాకు విఎల్టీ ఉందని మరోసారి గోడను పగలగొట్టడంతో భూమా బ్రహ్మానందరెడ్డి రంగప్రవేశం చేసి స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. పూర్తి విషయాలు కనుగొని అక్కడ నుంచే మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో ల్యాండ్ కన్వర్షన్ కానీ స్థలం కు విఎల్టీ ఎలా వేశారని ఫోన్ లో ప్రశ్నించడంతో మున్సిపల్ కమిషనర్ వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మీడియా తో మాట్లాడుతూ గెలివి,బద్రిశెట్టి కుటుంబీకులు వారి స్థలం సమస్య నా దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఈ రోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు గోడ పగలగొడుతున్నారనే విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చానన్నారు. పూర్తి విషయాలు తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తో ఫోన్లో ఈ స్థలం కు ల్యాండ్ కన్వర్షన్ లేకుండా విఎల్టీ ఎలా వేసారు అని ప్రశ్నించడంతో అక్కడనుంచి సమాధానం లేదన్నారు. సంబంధం లేని వ్యక్తులుఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ కన్వర్షన్ లేని స్థలానికి మున్సిపల్ అధికారులతో విఎల్టీ సృష్టించుకున్నారని ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తి చేసి తప్పు చేసిన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నంద్యాలలో కబ్జాలు పెరిగిపోతున్నాయి అని న్యాయం ఉంటే నేను ఉన్నంతవరకు ఎవరికి అన్యాయం జరగనివ్వనని బరోసా ఇచ్చారు.నంద్యాలలో ఎవరైనా సరే అన్ని కరెక్టుగా ఉండే,తప్పు లేకుండా ఉంటే వారి స్థలాలు ఎవరైనా కబ్జాకు ప్రయత్నిస్తే నేను అండగా ఉండి ఎంతవరకైనా ,ఎంతదూరమైనా వెళతానని హామీ ఇచ్చారు.అనంతరం గెలివి రామకృష్ణ,శరత్ మాట్లాడుతూ ఈ స్థలం గెలివి,బద్రిశెట్టి కుటుంబాలు 1984 లో చాబోలు రాస్తా లో 172/1 లో 75 సెంట్ల స్థలము కొనుగోలు చేశామన్నారు.మా స్థలానికి సంబంధించి 100 ఏళ్ల లింక్ డాక్యుమెంట్స్ తో పాటు అర్,ఎస్,అర్ లో మా పేర్లు ఉన్నాయన్నారు.ఆరునెలల క్రితం మా స్థలంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు భారీ గా వచ్చి ఈ స్థలం మాదే అంటూ దౌర్జన్యం చేసి గోడను పగలగొట్టి మాపై దాడి చేశారన్నారు.అప్పట్లో ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ,జిల్లా కలెక్టర్,అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్లనున్నారు.ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్క్రుస్తించుకని విఎల్టీ వేయించుకున్నారని తెలిసి న్యాయం కోసం మేము మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నీ ఆరైంచమన్నారు. విఎల్టీ ఉందని మా స్థలంలో దౌర్జన్యంగా వచ్చి గోడను కూల్చారన్నారు. ఉన్నత అధికారులు భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి విచారణ చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. స్థలానికి ల్యాండ్ కన్వర్షన్ లేకుండా విఎల్టీ వేసిన అధికారులపై చర్యలు ఉంటాయో లేవో వేచిచూద్దాం. నంద్యాల మున్సిపల్ అధికారులకు భారీగా డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణ గా తీసుకోవచ్చు.
