



సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 27 :
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల శిక్షణా కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు చరిత రెడ్డి తో కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి Nmd ఫిరోజ్ హాజరయ్యారు.
ఈ వర్క్‌షాప్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు తదితర సీనియర్ నాయకులు పాల్గొని, బూత్ స్థాయి నుంచే పార్టీని మరింత పటిష్టంగా నిర్మించాల్సిన అవసరాన్ని స్పష్టంగా వివరించారు. నాయకత్వ నైపుణ్యాల పెంపుదల, కార్యకర్తలను ప్రజలతో మరింత దగ్గర చేసే వ్యూహాలు, కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లో విశ్తృతంగా తీసుకువెళ్లడం,ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య, దుష్ప్రచారాలను బలంగా ఖండిస్తూ నిజాలను వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతపై వక్తలు సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు.
ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి కూటమి ప్రభుత్వం పై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పం ఈ వేదికపై స్పష్టంగా ప్రతిబింబించింది.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మంత్రులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
