పోలీస్ మొబులైజేషన్ కార్యక్రమంలో స్ట్రెస్ మేనేజ్మెంట్, ఆల్కహాల్ డి అడిక్షన్, బెట్టింగ్ యాప్ లపై ప్రత్యేక కౌన్సిలింగ్ తరగతులు

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 27 :
నంద్యాల జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమం కొరకు స్ట్రెస్ మేనేజ్మెంట్, ఆల్ ఆల్కహాల్ డి అడిక్షన్, బెట్టింగ్ యాప్ లపై నిపుణులచే ప్రత్యేక కౌన్సిలింగ్ తరగతులు ఏర్పాటు చేయాలన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు పోలీస్ మొబులైజేషన్ తరగతులలో శాంతిరామ్ మెడికల్ కళాశాల నుండి సైకియాట్రీ విభాగం డాక్టర్ సింధుజ ఎంబిబిఎస్, యం డి వారిచే పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కౌన్సిలింగ్ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ సింధుజ మాట్లాడుతూ పోలీసులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఎక్కువ పనిభారం,షిఫ్ట్ డ్యూటీలు, అడ్మినిస్ట్రేటివ్ ఒత్తిడి, కుటుంబ సమస్యలు మరియు భద్రతా సవాళ్ల వల్ల వచ్చే మానసిక, శారీరక ఒత్తిడి, వలన డిప్రెషన్ కుదారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా నిద్ర లేమి, రక్తపోటు పెరగడం, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పైఅనారోగ్య సమస్యలను నివారించడానికి ప్రతిరోజు యోగ, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. తద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కలుగుతుంది. యోగా వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కండరాలు, కీళ్లు బలపడతాయి.శ్వాసక్రియ మెరుగై, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఒత్తిడి, ఆందోళన తగ్గి, మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. వ్యాయామం వలన శారీరక దృఢత్వంతో పాటు రక్త ప్రసరణ పెరుగుతుంది. తద్వారా రక్తపోటు మధుమేహం తగ్గడంతో పాటు పని ఒత్తిడిని నివారించవచ్చు. ఆల్కహాల్ సేవించడం వలన దీర్ఘకాలంలో అనేక వ్యాధుల బారినపడే అవకాశం ఉందని కాలేయం దెబ్బ తినడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేయడం తగ్గిపోతుందని, ఇవి కుటుంబంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలియజేశారు. బెట్టింగ్ యాప్‌ల నియంత్రణపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, జూదం అనేది వ్యసనం ఇది మానసిక ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది కావున వాటికి దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధుజ తో పాటు రిజర్వ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ RSI మనోహర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top