అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం – టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల / జనవరి 23 :
నంద్యాల పట్టణంలోని జీవి మాల్ పక్కన గల కార్పెంటర్ షాపులో నిన్న అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రమాద స్థలాన్ని సందర్శించి, కాలిబూడిదైన షాపును పరిశీలించారు. బాధితులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపులోని విలువైన కలప, ఫర్నీచర్ మరియు యంత్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీనివల్ల సదరు కార్మికుడు తన జీవనోపాధిని కోల్పోవడం బాధాకరమన్నారు . అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితుడినికి అండగా ఉంటామన్నారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు బాధితులు పాల్గొన్నారు.

Scroll to Top