నంద్యాల 22వ వార్డు సమస్యల పై మంత్రి ఫరూక్ కి వినతి పత్రం అందజేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మరియు వార్డు ప్రజలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 22 :
నంద్యాల పట్టణంలోని 22వ వార్డు (రైతు నగరం) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని గురువారం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మరియు వార్డు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, రైతు నగరంలో నెలకొన్న రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మరియు స్మశాన వాటికకు సంబంధించిన సమస్యలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యల వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను, అలాగే స్మశాన వాటిక వద్ద కనీస సౌకర్యాల లేవని హరిబాబు మంత్రి ఫరూక్ కి వివరించారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ ఒక వినతి పత్రాన్ని అందజేశారు. వార్డు ప్రజల సమస్యలను విన్న మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా 22వ వార్డు సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబుతో పాటు రైతు నగరం వార్డు ప్రముఖులు, స్థానిక ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top