33 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన – నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

పేద ప్రజలు ఆపదలో ఉంటే ‘నేనున్నాను’ అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో (రాజ్ టాకీస్) నందు 33,51,863 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎక్కువ ఆక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, లేదా ఆరోగ్య పరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావల్సిన డబ్బులు లేకపోవడం, ,వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మంత్రి ఫరూక్ కి విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని, అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించారన్నారు. అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మంది బాధిత కుటుంబ సభ్యులకు వచ్చిన 33 లక్షల 51 వేల 863 రూపాయలను చెక్కుల రూపంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్  క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అతి కొద్ది కాలంలోనే 3 కోట్ల రూపాయలను 426 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని ఫిరోజ్ తెలియజేశారు .. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియర్ ఖలీల్ , గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి, కౌన్సిలర్ కండే శ్యాంసుందర్ లాల్ , బింగుమల్లె శ్యామ్ సుందర్ గుప్తా , కామిని మల్లికార్జున మరియు వార్డు ఇన్చార్జిలో , టిడిపి నాయకులు , కార్యకర్తలు , అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top