
ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, వైస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి గారు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు, రైతు విభాగం నాయకులు, గడివేముల మరియు పాణ్యం మండల నాయకులు, అనుబంధ విభాగాల జిల్లా మరియు నియోజకవర్గ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం ఏదో ఒక కారణం చెబుతూ రైతులను ఆదుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కూటమి అధికారంలో ఉన్న నాయకులు, మంత్రులు ఈ కీలక సమస్యపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
అలాగే రైతు విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరూ నిరాహార దీక్షకు సిద్ధమని హెచ్చరించారు.
