

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 13 :
నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలో ని నారాయణ పాండే హై స్కూల్ అధ్యక్షులు వి ఖాజా హుస్సేన్ మరియు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ యాకూబ్ పాఠశాల కరస్పాండెంట్ ఇషాక్ వలి ఆధ్వర్యంలో ఈద్ కిట్ ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఈఇమామ్ వఖాతిబ్ హఫీజ్ షేక్ హిదాయతుల్లా సాహెబ్ మరియు మౌలానా బషీర్ అహ్మ ద్ పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ యాకూబు మాట్లాడుతూ రంజాన్ పండగని పురస్కరించుకొని ఆదాయం రెండున్నర పర్సెంట్ జకాత్ రూపంలో తీసి నటువంటి నిధి ద్వారా ఈద్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది పండగని సుఖసంతోషాలతో ఆనందదాయంగా జరుపుకోవాలని అల్లా ఆదేశాల మేరకు మా నారాయణ పాఠశాలలో గత నాలుగు సంవత్సరాలు నుండి దాదాపుగా 250 మంది పేదలు వితంతువులకు ఈ కిట్ల పంపిణీ చేయడం జరిగింది . ఈ కిట్ల ఉద్దేశం అల్లా ఆదేశాల మేరకు నిరుపేదలు కూడా పండుగ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఇవ్వడం జరిగింది ఇందులో దాదాపుగా 13 రకాల వస్తువులను కిట్ రూపంలో ఇవ్వడం జరిగింది ముఖ్యఅతిథి అయినటువంటి ఈఇమామ్ వఖాతిబ్ హఫీజ్ షేక్ హిదాయతుల్లా సాహెబ్ మాట్లాడుతూ ఈ యొక్క పాఠశాలలో ఈద్ కిట్ల పంపిణీ గత నాలుగు సంవత్సరాలుగా డాక్టర్ యాకూబ్ మరియు ఇషాక్ వలి వీరిద్దరి ఆధ్వర్యంలో పాఠశాలలో దాదాపుగా 500 కిట్లను పంపిణీ చేయడం జరిగింది అని వీ
రు చేసినటువంటి యొక్క గొప్ప కార్యానికి ఆ అల్లా యొక్క దువా దీవెనలు ఎల్లప్పుడూ వీరితో ఉండాలని విరు మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం జరిగింది మౌలానా బషీర్ అహ్మద్ మాట్లాడుతూ యొక్క రంజాన్ నెల చాలా పవిత్రమైనదని ఈ నెలలో చాలామంది దానధర్మాలు చేసి అల్లా యొక్క కృపకు పాత్రులు అవుతారని ఈ నెలలో ప్రతి ముస్లిం కూడా ఉపవాసాలు నమాజ్ చేసి ఖురాన్ పటించడం జరుగుతుందని అదేవిధంగా జకాతు ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు వాళ్లు కూడా సుఖ సంతోషాలతో పండగ జరుపుకుంటారని చెప్పడం జరిగింది పాఠశాల యాజమాన్యం కేవలం ధార్మికంగా ఆధ్యాత్మికంగా కాకుండా విద్యాపరంగా కూడా పాఠశాలలో ఉన్నతమైన విద్యని పిల్లలకు అందిస్తున్నారని ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి ఫీజులో రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో తాహేరా సుల్తానా హెయిర్ సుల్తాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ మెంబర్ వి యూసుఫ్ సాయి వాణి పాఠశాల కరస్పాండెంట్ హుస్సేన్ బాషా మరియు నారాయణ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
