నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రముఖ కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 13 :

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రముఖ కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవయిత్రి మొల్ల చిత్రపటానికి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆతుకూరి మొల్లమాంబ (కవయిత్రి మొల్ల) 16వ శతాబ్దంలో కడప జిల్లా గోపవరం గ్రామం నందు సామాన్య కుటుంబంలో జన్మించింది. మొదటి మహిళా కవయిత్రిగా స్వతంత్ర రచనలకు మార్గం వేసింది. కవయిత్రి మొల్లగారు తన అద్భుత ప్రతిభతో ‘మొల్ల రామాయణాన్ని’ అతి సులువైన పదాలతో అందరికీ   అర్థమగురీతిలో తెలుగులో  రాసి ముద్దులయ్యేలా చేసింది. ఆమె రాసిన రామాయణం ‘మొల్ల రామాయణం’గా ఎంతో ప్రసిద్ధి చెందింది. రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా కూడా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతలు కాంచింది. ఎటువంటి రాజపోషణ లేకుండా, కేవలం భక్తితో ఆమె చేసిన సాహిత్య కృషి నేటి తరానికి, ముఖ్యంగా మహిళా సాధికారతకు గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి తో పాటు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్, బాబు, ఆర్ఎసై లు ఉమామహేశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ,శ్రీనివాసులు జిల్లా పోలీస్ పరిపాలన విభాగం అధికారులు కృష్ణారెడ్డి, ఖాదర్ వలీ,మరియు సిబ్బంది. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top