

సత్యం వార్త / నంద్యాల / జనవరి 22 :
నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయంలో నలుగురు లబ్ధిదారులకు 1,21,696 రూపాయలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. అనంతరం వైద్య సహాయం పొందిన రోగుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత టిడిపి నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
