
సత్యం వార్త / నంద్యాల / జనవరి 22 :
నవనందులలో మొదటి క్షేత్రము అయిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రమద నందీశ్వరస్వామి దేవస్థానం లో జరుగుతున్న అభివృద్ధి పనులకు గాను మంత్రి ఫారుక్ సమక్షంలో మాజీ కౌన్సిలర్ స్వర్గీయ చింతల సుబ్బరాయుడు జ్ఞాపకార్థం వారి కుమారుడు చింతల నాగ కుమార్ 50000 రూపాయలు దేవస్థానం చైర్మన్ బాబుకు అందజేయడం జరిగింది. దేవస్థానంలో షెడ్డు నిర్మాణం నకు దాదాపు 12 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. శివరాత్రి పండుగ సమయానికి అన్నదాన ప్రాంగణంలో ఉన్న ఐదు గదులు పూర్తయి భక్తులకు అందుబాటులోకి వస్తాయని దేవస్థానం చైర్మన్ చలం బాబు తెలిపారు. భక్తులు దాతలు సహకరించాలని కోరారు.
