వైశ్యులంటే ఇంత చులకన భావమా – గోళ్ళ రాజేష్

నంద్యాల ప్రజలకు ఆదుకుంటే పాపమా..లేదు. పేద, బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా ఆదుకోవడం ఒక శాపమా…

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 17 :

నంద్యాల వాసి గోళ్ళ  రాజేష్ ప్రముఖ పారిశ్రామికవేత్త,సామాజికవేత్త గత నాలుగు నెలలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొంతమంది పెద్దలము,గొప్పవాళ్ళమని చెప్పుకొని తిరిగేవాళ్లు నామీద తప్పుడు ప్రచారాలు చేస్తూ నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి పెద్దవాళ్ళను నేను ఎదురుకోలేను ఎందుకు అంటే నేను వాళ్ళంత పెద్ద మనిషిని కాదు వాళ్లకు ఉన్నంత చెడ్డ మనసు నాకు లేదు. ఈ సేవా కార్యక్రమాలను ఏదో రకంగా నిలిపివేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. అటువంటి వారికి నేను ఒకటే సమాధానం చెప్ప దలుచుకున్నాను. ఈ సేవా కార్యక్రమాలు ఇలాంటి పెద్ద మనుషులు చేయూతనిచ్చి చేస్తే గర్వంగా ఉంటుంది.  అప్పుడు ప్రజల ముందుకు బేషరతుగా నేనే వచ్చి వీళ్ళు పెద్ద మనుషులు వీళ్లు పెద్ద గొప్పవాళ్ళని చెప్పగలను.  ఇలాంటి చిల్లర పనులకు సమయం వెచ్చించే బదులు ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.  ఇలాంటి తప్పుడు ప్రచారాల్లో నా కుటుంబ దాయాదులు కూడా అందరి కంటే ముందు ఉన్నారు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వాళ్లకు ఒకటే నా విన్నపం గతంలో ఏదో చేశాను ఇలాంటి తప్పుడు ప్రచారాల కంటే మీరు సేవ చేసి మీరు ముందుకు వచ్చి మాట్లాడండి అప్పుడు నేను కూడా గర్వంగా నా కుటుంబ వంశస్తులు అని చెప్పుకుంటాను. బయట మనుషుల్ని తిట్టే బదులు ఇంట గెలిచి రచ్చ గెలచమన్నారు పెద్దలు. అలాంటి ఇంటికి పేర్లు కూడా నేను వాడడం లేదు దయచేసి ఇది గమనించగలరు.

అటువంటి పెద్ద మనుషులకు గాని నాకు గాని ఎటువంటి సంబంధాలు లేవు వాళ్ళు వాళ్ళ పేర్లు గొప్పగా చెప్పుకోవడంలో ఉన్నంత శ్రద్ధ వాళ్ళ వ్యాపారం మీద పెట్టుకుంటే బాగుంటుంది.

గతంలో నేను నా స్నేహితులు కోసం తెలిసీ తెలీయనీ వయస్సులో  కొన్ని తప్పులు చేసింది కూడా వాస్తవమే నా తప్పులుద్దుకొని అన్ని క్లియర్ చేసినా కూడా నా మీద బురదజల్లే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించగలరు ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్లకు తగిన బుద్ధి ప్రజలే సమయం వచ్చినప్పుడు చెప్తారని ఆశ భావం వ్యక్తం చేస్తున్నాను. నంద్యాల ప్రజలకు సేవలు చేస్తూ ఉంటే  కొంత మంది పెద్దమనుషలం అనుకునే వారు ప్రజల విశ్వాసం ఏంటో ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో దాని పరిణామాలు త్వరలో మీరే తెలుసుకుంటారు.  నోరు ఉంది కదా అని ఏది పడితే అది కొంతమంది ముందర అవాకులు, చెవాకులు మాట్లాడుతూ ప్రజలను తప్పుడు దోవ పట్టిస్తున్న వెధవలకు తగిన గుణపాఠం త్వరలోనే చెప్తానని మనవి చేస్తున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రాన నాకు ఎలాంటి బాధ గాని ఏమీ లేదు ఎందుకంటే ఒక సామెత  ఉంది ఆకాశం పైన ఉమ్మితే ఆ ఉమ్ము నీ మొహం మీద పడతాదని గమనించగలరు. ఇలాంటి ప్రచారాలు కొంతమంది పార్టీల నాయకులు కూడా చేయడం  గమనార్హం.

మేము నాయకులం మేము చెప్పింది జరుగుతది అనే భ్రమలో బతుకుతున్న వారికి త్వరలో నోటికి వారికీ సమాధానం కచ్చితంగా ఇస్తాను అని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.

ఒక గ్రామానికి చెందిన ఒక రెడ్డి ఆయన ఎక్కడో కోల్పోయి నా మీద బురద జల్లాలని వారి వ్యక్తిగత విషయాలను నా మీద రుద్ది నన్ను మానసికంగా మరియు ప్రజలలో ఆదరణ చూసి తట్టుకోలేక నాకు అన్ని కోట్లు బాకీ, ఇన్ని కోట్లు బాకీ  అని చెప్పుకొని తిరుగుతున్న ఈ రెడ్డి కూడా బహిరంగంగా ఆయన దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టితే నేను నిజంగా తప్పు చేస్తే సరిదిద్దగలనని పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను.  ఇలాంటి పనికిమాలిన పనులు చిల్లర వేషాలు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా నాయకులు అది మన ఖర్మ.నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ నా  ఒక విన్నపం ప్రజలకు సేవ చేస్తున్నది కూడా వ్యాపారంగా చూసే ఇలాంటి పెద్ద నాయకులు,ఇలాంటి పెద్ద మనుషులను ఉన్నంతకాలం సామాజికంగా ఎవరు సమతుల్యం ఉండదు ఇటువంటి వారిని గుర్తించి వారి నాయకత్వాన్ని వారి మనుగడును తిరస్కరించాలని ప్రజలను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఓ నాయకుడు నాతో మాట్లాడిన మాట ఒకటే ప్రజలకు ఎంత సేవ చేసినా ప్రజలకు వారికి విశ్వాసం ఉండదు అనే ఒక మాట నా మనసుకు ఎంతో ఆవేదన కలిగింది. పత్రిక ముఖంగా ఇటువంటి వారిని గుర్తించి వారి వారి విలువ నంద్యాల నియోజకవర్గ ప్రజలు తెలీయజేయగలరనీ ప్రజలకు విన్నవిస్తున్నాను.  ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ ప్రజలకు వరం కావాలి గాని ఇలాంటి చెత్తా,చెదారం ఇటువంటి పనిలేని పనులు చేయడం వారిని ప్రజలు ఎవరు నమ్మరు.  అటువంటి నాయకుల్ని దూరం పెట్టండి అది మనం భావితరాలకు ఇచ్చే ఒక వరం.ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కి మేము డబ్బులు ఇచ్చాము మేము మిమ్మల్ని కొన్నాము మేమేం చెప్తే అది జరగాలని నీ అంత పోకడలకు పోతున్న నాయకులకు ఇది ఒక గుణపాఠం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనేం పాలిటిక్స్ చేయడం లేదు నేనేం రాజకీయాలకు రాలేదు అయినా నా మీద  ఇటువంటి బురద చల్లడం జరుగుతున్న మూర్ఖులకు ఇది ఒక గుణపాఠంగా ప్రజలు తీరుగాబడితే ఏమవుతుంది అని ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులని ప్రజలే నిర్ణయిస్తారు. ఇలాంటి తప్పుడు,ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే మనుషులని కచ్చితంగా న్యాయపరంగా వారికి సమాధానం త్వరలోనే ఇస్తాను.

Scroll to Top