” ఆల్బెండ జోల్ మాత్రలు వేసుకుందాం నులిపురుగులను నిర్మూలన సాధిద్దాం ”

” ఫిబ్రవరి – 17వ తేది ఆల్ బెండ జోల్ 400 మి. గ్రా మాత్రల పంపిణీ కార్యక్రమం”

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 17 :

ఫిబ్రవరి -17 వ తేదీన జిల్లాలో ” జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ” సందర్భంగా ఈరోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ, రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ మరియు నులిపురుగుల కార్యక్రమం నంద్యాల జిల్లా మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ దేవసాగర్, నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి, మధ్యాహ్నము భోజనము తరువాత విద్యార్థినిలకు ఆల్ టెండ జోల్ 400 మి.గ్రా. మాత్రలు మింగించడము.  రాష్ట్రీయ బాల స్వస్థా కార్యక్రమములో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము, వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యములో ప్రతి సంవత్సరము రెండు సార్లు, ప్రతి ఆరు నెలలకొకసారి నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమంలో భాగంగా, ఆల్ బెండజోల్ 400 మి.గ్రా. మాత్రలు మింగించడము జరుగుతుందని, ఈ సంవత్సరము ఫిబ్రవరి -17 వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలో చదువుచున్న విద్యార్థులతో పాటు చదువుకు దూరంగా, ఇండ్ల దగ్గర ఉన్న 1-19 సం. వారికి మరియు గ్రామాలలోని ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో రిజిస్టర్ అయిన 1-5 సం. చిన్నారులందరికి కూడా మధ్యాహ్నము భోజనం చేసిన అరగంట తరువార మాత్రలు మింగించడము జరుగుతుందని, ఈ మాత్రలు చప్పరించి నమిలి మింగే టట్లు విద్యార్థులకు, తల్లులకు అవగాహనా కల్పించడము జరిగినదని తెలిపారు.  జిల్లాలో మొత్తము ఆల్బెండ జోల్ 400 మి.గ్రా మాత్రలు మింగే 1-19 సం. వయసు గలవారిని 438475 మంది లబ్ధిదారులుగా గుర్తించడము జరిగినదని, 1663 అంగన్వాడీ కేంద్రా లలో 122094 మంది చిన్నారులు, 3318 ప్రభుత్వ మరియు ప్రయివేట్ విద్యా సంస్థలలో 315991 మంది 6-19నిం. వారికి ఫిబ్రవరి 17వ తేదీన జిల్లాలో ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ విద్యా సంస్థలను స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు సందర్శించి, అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాద్యాయులు, ప్రిన్సిపల్స్, సహకారముతో మధ్యాహ్నము భోజనము ముగిసిన అరగంట తరువాత విద్యార్థులకు, ఆల్ టెండ జోల్ మాత్రలు 400 మి.గ్రా. చప్పరించి, నమిలి మింగేటట్లు చేయడము జరిగినదని, అంగన్వాడీ కేంద్రాలలో సిబ్బంది సమన్వయముతో, 1-2 సం. చిన్నారులకు మాత్రలో నిగము స్పూన్స్ తో పొడిచేసి, 2-5 సం. వయసు వారికి పూర్తి మాత్ర ను స్పూన్స్ తో పొడిచేసి మాత్రలు వేయడము జరిగినదని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ సార్ గారు అన్నారు. ఈ రోజు ఏ కారణముచేతనైన మాత్రలు వేసుకోవడము తప్పిపోయిన వారికి మాస్అప్ రోజు ఫిబ్రవరి 24 వ తేదీ వేయడము జరుగుతుందని, ఈ మాత్రలు వేసుకున్న వారి వివరాలను ఆన్లైస్ లో ఎంటర్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కాంతారావు నాయక్, డాక్టర్ లక్ష్మి ప్రసన్న, వైద్యాధికారి రమ్యకృష్ణ, మానిటరింగ్ అధికారి కోటిరెడ్డి, విద్యా శాఖాధికారి జనార్దన్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ శేషన్న, ఐ.సి.డి.ఎస్. నోడల్ అధికారి ఉమా, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు బ్రహ్మయ్య, శివరామ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు చిత్రలేఖ, సిబ్బంది గురప్ప, వెంకటరమణ పాల్గొన్నారు.

Scroll to Top