రోడ్డుప్రమాద నివారణలో భాగంగా స్పెషల్ డ్రైవ్ అవగాహన నిర్వహించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ భాషా

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ రిపోర్టర్ / జనవరి 6:
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి IPS సూచనలతో నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా ఆధ్వర్యంలో నేడు నంద్యాల పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 10 ఆటోలను స్వాధీనం చేసుకొని పలు మోటార్ వెహికల్ పై జరిమానా విధించడం జరిగింది.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు మోటార్ వాహనాల చట్టం (M.V Act) యొక్క నియమాలు మరియు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. అధిక లోడుతో ప్రయాణికులను చేరవేయరాదని, డ్రైవర్ కు ఇరుపక్కల ప్రయాణికులను కూర్చోబెట్టుకోరాదని తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు లైసెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పిస్తూ నిబంధనలో ఉల్లంఘించిన వారి పై చర్యలు తీసుకోవడం జరిగింది. కావున వాహనాలు నడిపి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి కలిగి ఉండడంతో పాటు వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు.
నంద్యాల పట్టణంలో పట్టణంలో క్రమశిక్షణగల ట్రాఫిక్ వాతావరణాన్ని పెంపొందించడం కొరకు ఆటోలను ఆటో స్టాండ్ లలో మాత్రమే పార్కింగ్ చేయాలని, ఓవర్ స్పీడ్ తో ఆటోలు నడిపి ప్రమాదంలో పడరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలియజేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు విధించబడతాయని హెచ్చరిస్తున్నారు.

Scroll to Top