ఈ-సాక్ష్య (e-Sakshya) పోలీస్ యాప్ పై జిల్లా పోలీసు కార్యలయంలో ప్రత్యక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ రిపోర్టర్ / జనవరి 6:
నంద్యాల జిల్లాలోని పోలీసు సిబ్బందికి ఈ-సాక్ష్య (e-Sakshya) పోలీసు యాప్ పై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు నేడు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N యుగంధర్ బాబు ఆద్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బందికి (CCTNS సిబ్బందికి) జిల్లా పోలీసు కార్యలయంలో ప్రత్యక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.
ఈ‌ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన e-Sakshya(ఈ-సాక్ష్య ) పోలీస్ యాప్ అనేది పోలీస్ శాఖలకు అందుబాటులో ఉన్న మొబైల్ యాప్, పోలీసు అధికారులు నేర స్థల పరిశీలన సాక్షాదారాల సేకరణ మొదలగు వాటిని ఫోటోలు ,వీడియోల రూపంలో 4 నిమిషాల వరకు రికార్డ్ చేయవచ్చు.సదరు వీడియోలు మరియు ఆడియో సాక్ష్యాలను ప్రత్యక్షంగా సేకరించిన సాక్ష్యాలు వెంటనే క్లౌడ్ ఆధారిత సర్వర్‌లలో అప్‌లోడ్ చేయబడతాయి, దీనివల్ల సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉండదు. ప్రతి ఫోటో లేదా వీడియో,ఆడియో ఎక్కడ, ఏ సమయంలో తీశారో తెలిపే GPS లొకేషన్ మరియు టైమ్ స్టాంప్ ఆటోమేటిక్‌గా రికార్డ్ అవుతుంది.భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) నిబంధనలకు అనుగుణంగా డిజిటల్ ఆధారాలను సురక్షితంగా నిల్వ చేస్తుంది.దీని వలన పోలీసులు సేకరించిన సాక్షాదారాల మార్పులు చెయ్యకుండా క్లౌడ్‌లో నిల్వ చేయబడతాయి ఈ విదంగా చెయ్యడం ద్వారా కేసుల విచారణల్లో సమయం తగ్గుతుంది మరియు నేరం చేసిన వారికి తప్పనిసరిగా శిక్ష విదించబడడం జరుగుతుంది.ఈ విదానం దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాల్లో అమలులో ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తో పాటు DCRB ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ధనమ్మ పాల్గొన్నారు.

Scroll to Top