
నంద్యాల / గోస్పాడు, డిసెంబర్ 26- 2025 / సత్యం వార్త :
రూ.5.33 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభం –
మంత్రులు ఎన్.ఎం.డి. ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల నియోజకవర్గం, గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో రూ.5.33 కోట్ల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డా. బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నాబార్డ్ నిధులు రూ.5.33 కోట్లతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఒక్క నంద్యాల జిల్లాలోనే రూ.150 నుంచి రూ.160 కోట్ల వ్యయంతో హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుతుందనే భ్రమలో ప్రజలు ఉండవద్దని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నేడు అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన వైద్యులతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆసుపత్రులకు శంకుస్థాపనలు చేసి, నిర్మాణాలపై గొప్పలు చెప్పుకున్నప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారని తెలిపారు. యాళ్లూరు గ్రామంలో ఆసుపత్రి నిర్మాణానికి స్థలం అందించిన దాతలకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా ఉన్న యాళ్లూరులో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గతంలో అత్యవసర వైద్య సేవల కోసం నంద్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ అవసరం తగ్గుతుందని అన్నారు. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ప్రజలు ఆహార నియమాలతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రూ.5.33 కోట్లతో అధునాతన వైద్య పరికరాలతో కూడిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెంటల్ సర్వీసెస్, ఫిజియోథెరపీ తదితర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 56 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), 19 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీలు), 11 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 2 ఏరియా ఆసుపత్రులు ప్రజలకు సేవలందిస్తున్నాయని వివరించారు. ఆధునిక జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ సామర్థ్యం పెంపు అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ లలిత, హెచ్‌డీఎస్‌సీ సభ్యుడు వెంకట్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డా. శ్రీరామ్ కుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- 1 వ వార్డు కౌన్సిలర్ నాగార్జున TDP
- 36వ వార్డు టిడిపి ఇంచార్జ్ మారుతి ప్రసాద్
- 9 వార్డ్ టీడీపీ ఇంచార్జి చెన్నం శెట్టి శ్రీనివాసులు
- ABOUT US
- ACCIDENTS
- AISF
- AITUC
- AIYF
- APUWJ JOURNALISTS
- BANKS
- BC
- BCY PARTY
- BJP
- CHRISTIAN
- CITU
- Contact Us
- CPI
- CPM
- DIPRO
- DM&HO – వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ
- DOCTORS / HOSPITALS
- DRDA – VELUGU
- E-PAPER
- FIRE
- HOME
- ICDS
- IHRPC
- JANASENA
- MAHANANDI
- MP BYREDDY SHABARI
- MUSLIM
- Nandyal News
- POLICE
- RDO
- RGM COLLEGE
- RTO
- SCHOOLS
- SDPI
- SFI
- SPORTS
- SRI RAMAKRISHNA DEGREE COLLEGE
- SSGRBCC
- TDP
- TEACHERS ASSOCIATION
- TEMPLES
- Uncategorized
- YSRCP
- అంగన్వాడీ
- అల్ మెవా
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ ఎన్ బషిరున్నీసా బేగం
- ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్
- ఆయుష్ యోగా కేంద్రం
- ఏవీ సుబ్బారెడ్డి
- ఓం శరవణ బావ సేవ ట్రస్ట్
- కండె శ్యాంసుందర్ లాల్ 12 వార్డ్ కౌన్సిలర్ TDP
- కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం
- ఖలీల్ TDP
- గోళ్ళ రాజేష్
- జమాతుల్ ఉలేమా వయిమ్మ పౌండేషన్
- టైలర్స్ అసోసియేషన్
- డాక్టర్ రవి కృష్ణ
- డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్
- తహశీల్దార్ శ్రీనివాసులు (అర్బన్)
- తాటికొండ బుగ్గ రాముడు 38 వార్డు ఇంచార్జ్
- దాల్ మిల్ అమీర్
- నంది విజ్ఞాన కేంద్రం
- నంద్యాల జిల్లా
- నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
- నారాయణ పాండే హై స్కూల్
- నేషనల్ డిగ్రీ కళాశాల
- పరివర్తన లైఫ్ సెంటర్
- పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ
- పీపుల్స్ హెల్త్ సొసైటీ
- ప్రింటర్స్ అసోసియేషన్
- బాల అకాడమీ పాఠశాల
- భారత్ వికాస్ పరిషత్
- భూమా బ్రహ్మానంద రెడ్డి TDP
- మార్కెట్ ప్రసాద్
- మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు
- మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్
- మున్సిపల్ కార్యాలయం
- మెప్మా పీడీ వెంకట దాసు
- రామినేని రాజునాయుడు – ఆర్.వై.యూ అధ్యక్షులు
- రాయలసీమ సాగునీటి సాధన సమితి
- రైతు సంఘం
- లయన్స్ క్లబ్
- విద్యార్థి సంఘాలు
- వ్యవసాయ అధికారి
- శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్
- శిల్పా మహిళా సహకార సంఘం చైర్మన్ నాగినీ రవి సింగారెడ్డి
- శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం
- శ్రీ జగజ్జననీ దేవాలయం
- సన్నల సాయిరాం రెడ్డి
- సీనియర్ న్యాయవాది,మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి
- స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి లీలావతి
